పింక్ రీమేక్‌లో అజిత్ స‌ర‌స‌న విద్యాబాల‌న్

Tue,January 29, 2019 09:50 AM
vidya balan pair with ajith

ఇటీవ‌ల విశ్వాసం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అజిత్ త్వ‌ర‌లో పింక్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అజిత్‌కి 59వ చిత్రం కాగా, ఇందులో త‌మిళ నేటివిటీకి అనుగ‌ణంగా ప‌లు మార్పులు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. హిందీలో అమితాబ్‌బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో పింక్ తెర‌కెక్కింది. కాని త‌మిళంలో అజిత్‌కి స‌ర‌స‌న ఓ భామ‌ని న‌టింప‌జేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుండగా, విద్యాబాల‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రం విద్యా బాల‌న్‌కి త‌మిళంలో డెబ్యూ కానుంది. ఇక తాప్సీ పాత్ర‌లో తొలుత న‌జ్రియాని అనుకున్న‌ప్ప‌టికి ఇప్పుడు ఆ పాత్ర కోసం శ్ర‌ద్ధ శ్రీనాథ్‌ని తీసుకున్నారు. జర్నలిస్టు రంగరాజ్‌ పాండే కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అతి త్వ‌ర‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ చిత్రం త‌ర్వాత అజిత్ మ‌రోసారి శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.

936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles