సెన్సార్ బోర్డులో గౌత‌మి, జీవిత, విద్యాబాల‌న్‌

Sat,August 12, 2017 03:12 PM
సెన్సార్ బోర్డులో గౌత‌మి, జీవిత, విద్యాబాల‌న్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాల‌న్, తెలుగు హీరోయిన్లు గౌత‌మి, జీవితాలు ఇప్పుడు సెన్సార్ బోర్డులో స‌భ్యులు అయ్యారు. సీబీఎఫ్‌సీ బోర్డు చీఫ్‌గా ప్ర‌సూన్ జోషీని నియ‌మించారు. ఇటీవ‌లే సెన్సార్ బోర్డు మాజీ చీఫ్ పెహ‌ల‌జ్ నిహ‌లానీని తొలిగించిన విష‌యం తెలిసిందే. దాంతో శుక్ర‌వారం జోషీ నేతృత్వంలోని కొత్త బోర్డు స‌భ్యుల‌ను ప్ర‌క‌టించారు. నూత‌న స‌భ్యుల్లో గౌతమి, న‌రేంద్ర కోహ్లి, న‌రేశ్ చంద్ర‌లాల్‌, నీల్ హెర్బ‌ర్ట్‌, వివేక్ అగ్నిహోత్రి, వామ‌న్ కేంద్ర‌, విద్యాబాల‌న్‌, టీఎస్ నాగ‌భ‌ర‌ణ‌, ర‌మేశ్ ప‌తంగి, వాని త్రిపాఠి, జీవితా రాజ‌శేఖ‌ర్, మిహిర్ భూటాలు ఉన్నారు. ఇన్నాళ్లూ పెహ‌ల‌జ్ నిహ‌ల‌నీ అత్యంత వివాదాస్ప‌ద సీబీఎఫ్‌సీ చీఫ్‌గా కొన‌సాగారు. ఆయన్ను తొలిగించ‌డంతో బాలీవుడ్ సంబ‌రాలు చేసుకుంటున్న‌ది. రెండున్న‌ర ఏళ్లు సీబీఎఫ్‌సీ చీఫ్‌గా నిహ‌లానీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న స్ట‌యిల్లో ఫిల్మ్ సెన్సార్ స‌ర్టిఫికెట్లు ఇచ్చారు. స్పెక్ట‌ర్ ఫిల్మ్‌లో కిస్ సీన్‌ను క‌ట్ చేసిన త‌ర్వాత ఆయ‌న‌పై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. ఆ త‌ర్వాత ఉడ్తా పంజాబ్‌లో దాదాపు 89 క‌ట్‌లు చేశాడు.

4934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS