కుర్రకారుకు మత్తెక్కిస్తున్న మలయాళం సాంగ్.. వీడియో

Mon,February 12, 2018 12:43 PM
Video clip of Malayalam song Manikya Malaraya Poovi goes viral on social media

ఓ 26 సెకండ్ల వీడియో క్లిప్. మలయాళం సాంగ్‌లోని ఓ క్లిప్ అది. అంతే.. కాని.. గత రెండు మూడు రోజుల్నుంచి సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతున్నది. ఎంతలా అంటే.. కుర్రకారు కొన్ని వందలు, వేల సార్లు ఆ వీడియోను చూస్తూ.. ఆ వీడియోలో అమ్మాయి హావభావాలకు ముగ్ధులైపోతున్నారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఎక్కడ చూసినా ఆ వీడియోనే. ఇక.. మరోవైపు ఆ వీడియోపై సెటైరికల్‌గా జోక్స్ వేస్తూ నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్‌'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్‌లోని ఓ క్లిప్ అది. ఆ వీడియోలో రకరకాల హావభావాలను పలికించిన సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళం హీరోయిన్.


కాని.. ఈ వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక.. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకాళ్లు మతులు పోగొట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మలయాళం సినిమా సాంగ్ మానిక్యా మలారాయ పూవి కూడా యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 46 లక్షల మంది వీక్షించారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోపై కూడా ఓ లుక్కేయండి మరి..


8250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles