అభిమానిని క‌లిసి ధైర్యం అందించిన వెంకీ

Sun,March 10, 2019 07:16 AM
Victory Venkatesh meets his fan

ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోలు క‌ష్టాల‌లో ఉన్న అభిమానుల ఇంటికి వెళ్ళి వారికి కొండంత ధైర్యం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీనియ‌ర్ నటుడు వెంక‌టేష్ త‌న అభిమాని ఇంటికి వెళ్ళి అత‌నిని ఆప్యాయంగా ప‌ల‌కరించాడు. అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటాన‌ని హామీ కూడా ఇచ్చాడు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. వివ‌రాలలోకి వెళితే వెంక‌టేష్‌ని అమితంగా ఇష్ట‌ప‌డే సురేష్ అనే అభిమాని ఎల్బీ న‌గ‌ర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. లివ‌ర్ క్యాన్స‌ర్ కార‌ణంగా కొంత కాలం నుండి మంచానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ విష‌యం తెలుసుకున్న వెంకీ ఎల్బీనగర్ సమీపంలోని మంసూరాబాద్‌లో ఉన్న అతడికి ఇంటికెళ్లారు. ఆప్యాయంగా అతడితో మాట్లాడిన వెంక‌టేష్ ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితిని, వైద్యంకి సంబంధించిన వివ‌రాల‌ని అడిగి తెలుసుకున్నారు. వెంకీ మ‌రోసారి త‌న మంచి మ‌న‌సు చాటుకోవ‌డంతో ఆయ‌న‌పై ప్రశంస‌ల జ‌ల్లు కురుస్తుంది. ప్ర‌స్తుతం వెంకీ మామ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న వెంక‌టేష్ ఇటీవ‌ల రాజ‌మండ్రిలో తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే మరో షెడ్యూల్‌ని మొద‌లు పెట్ట‌నున్నారు.

2601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles