జెర్సీ గ్రౌండ్‌లో వెంకీ సంద‌డి

Sun,April 14, 2019 07:26 AM
Victory Venkatesh is chief guest for jERSEY Pre Release event

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్‌లుగా తెర‌కెక్కిన చిత్రం జెర్సీ. పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగవంతం చేశారు.ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన చిత్ర యూనిట్‌, ఏప్రిల్ 15 సాయంత్రం 7.30 గం.ల నుండి శిల్ప క‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించ‌నుంది. ఈ వేడుక‌కి విక్ట‌రీ వెంక‌టేష్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కానున్న‌ట్టు టీం ప్ర‌క‌టించింది. జెర్సీ చిత్రం క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కడం, క్రికెట్‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే వెంక‌టేష్ చిత్ర ప్రీ రిలీజ్‌కి రావ‌డం విశేషం.ఇటీవల క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘మజిలీ’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు కూడా వెంకీ అతిథిగా హాజరయ్యారు. మొత్తానికి క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రాల‌కి వెంకీ త‌న‌వంతు స‌పోర్ట్ అందిస్తున్నాడ‌న్న‌మాట‌.

962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles