బాక్సాఫీసు వ‌ద్ద స‌ర్జిక‌ల్ దాడులు.. వంద కోట్లు దాటిన ఉరి వ‌సూళ్లు

Mon,January 21, 2019 02:53 PM
Vicky Kaushal film Uri becomes first blockbuster of 2019, joins Rs 100 Crore club

ముంబై : ఉరి ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ ఫిల్మ్‌.. బాక్సాఫీసు వ‌ద్ద స‌ర్జిక‌ల్ దాడులు చేస్తోంది. విక్కీ కౌష‌ల్ న‌టించిన వార్ ఫిల్మ్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త ఆర్మీ దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ క‌థా నేప‌థ్యంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో ఉన్న సైనిక స్థావ‌రంపై పాక్ ఉగ్ర‌వాదులు దాడి చేసి భార‌త జ‌వాన్ల‌ను చంపేస్తారు. ఆ దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం అత్యంత ర‌హ‌స్యంగా స‌ర్జిక‌ల్ దాడుల‌ను నిర్వ‌హిస్తుంది. ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో చిత్రాన్ని రూపొందించారు. ఉరి ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ సినిమా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ నెల 11వ తేదీన రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టికే వంద కోట్లు రాబ‌ట్టింది. మొద‌టి వారంలో ఈ సినిమా మొత్తం 36 కోట్లు సంపాదించింది. మొద‌టి అయిదు రోజుల్లోనే ఇది 50 కోట్లు వ‌సూల్ చేసింది. దీంతో ఈ ఏడాది మొద‌టి సూప‌ర్ హిట్ ఫిల్మ్‌గా ఈ వార్ మూవీ నిలిచింది. బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఈ సినిమాపై ట్వీట్ చేశారు. ఉరి ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ సినిమా వంద కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.3146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles