ప్రముఖ నటుడి తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

Mon,October 15, 2018 12:47 PM
Vicky Kaushal father and Stunt Director Shyam Kaushal is the latest celebrity in caught in Me Too

మీ టూ ఉద్యమంలో తాజాగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య సంజూ, రాజీలాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు విక్కీ కౌశల్ తండ్రి, యాక్షన్ డైరెక్టర్ అయిన శ్యామ్ కౌశల్‌పై ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేసింది. మనోరమ సిక్స్ ఫీట్ అండర్, అబ్ తక్ చప్పన్, హనీమూన్ ట్రావెల్స్‌లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఆమె.. 2006లో జరిగిన ఓ ఘటన గురించి వెల్లడించింది. ఓ ఔట్‌డోర్ షూటింగ్ సందర్భంగా శ్యామ్ కౌషల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ చెప్పింది. 2006లో ఓ ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నపుడు స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ వోడ్కా తాగడానికి నన్ను తన గదికి రమ్మని పిలిచాడు. అయితే నాకు తాగే అలవాటు లేదని చెప్పాను. దీంతో అతడు వెంటనే తన ఫోన్ తీసి అందులోని ఓ పోర్న్ వీడియోను నాకు చూపించాడు అని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని లైన్ ప్రొడ్యూసర్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత తానెప్పుడూ స్టంట్ టీమ్‌తో ఒంటరిగా వెళ్లలేదని, శ్యామ్ కౌశల్‌ను పూర్తిగా దూరం పెట్టినట్లు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వెల్లడించింది. ఆమె ఆరోపణలపై ఇప్పటివరకు శ్యామ్ కౌశల్‌గానీ, విక్కీ కౌశల్‌గానీ స్పందించలేదు.

2443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles