షూటింగ్‌లో ప్ర‌మాదం. హీరో ద‌వ‌డకి ప‌ద‌మూడు కుట్లు

Sat,April 20, 2019 01:09 PM
Vicky Kaushal Badly Injured Himself

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో విక్కీ కౌశ‌ల్‌కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ల‌భించింది. యురి విజ‌యంతో ఫుల్ జోష్ మీదున్న విక్కీ కౌశల్ స్వాతంత్రోద్యమకారుడు ఉధమ్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘ఉధమ్‌సింగ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. విక్కీ డోనార్, పింక్, అక్టోబర్, పికు చిత్రాల దర్శకుడు సూజిత్ సర్కార్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నాడు . రోన్నీ లాహరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో పాటు విక్కీ కౌశ‌ల్ భాను ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న గుజ‌రాత్ అనే హ‌ర‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తుండగా, ఓ భారీ డోర్ విక్కీపై ప‌డింద‌ట‌. దీంతో అత‌ని ద‌వ‌డ ఎముక విరిగింది. వెంట‌నే అత‌నికి ప్రాధ‌మిక చికిత్స చేసి ముంబై తీసుకెళ్ళారు. ఆయ‌న ద‌వ‌డ‌కి 13 కుట్లు ప‌డ్డాయ‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఆన ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు . గుజ‌రాత్ చిత్రంలో భూమి ప‌డ్నేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. విక్కీ కౌశల్ త‌క్త్ అనే చిత్రంలో ఔరంగ‌జేబు పాత్ర పోషించాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.


4525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles