కాస్టింగ్ కౌచ్‌పై భిన్న వాద‌న వినిపించిన కొరియోగ్రాఫ‌ర్‌

Tue,April 24, 2018 11:48 AM
veteran choreographer Defending the practice of casting couch,

హాలీవుడ్‌లో మొద‌లైన కాస్టింగ్ కౌచ్ నిర్మూల‌న ప్ర‌క్రియ బాలీవుడ్‌లో కొన్ని రోజులు ప్ర‌కంప‌నలు సృష్టించింది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌కి పాకింది. ప్ర‌స్తుతం కాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది లేడి ఆర్టిస్టులు భిన్న స్వ‌రాలు వినిపిస్తుండ‌గా, దానిని అరిక‌ట్టేందుకు ఇటీవ‌ల 'మా' జాయింట్ యాక్ష‌న్ క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రీసెంట్‌గా “త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. అంటే లైంగిక వేధింపుల స‌మ‌స్య నుండి కాపాడేందుకు టాలీవుడ్‌లో పెద్ద ప్ర‌ణాళిక‌లు రూపొందుతున్నాయి. ఈ క్ర‌మంలో బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ కాస్టింగ్ కౌచ్‌పై భిన్న వాద‌నలు వినిపించింది.

2000 సాంగ్స్‌కి కొరియోగ్రాఫ‌ర్‌గా పని చేసిన 69ఏళ్ళ స‌రోజ్ ఖాన్‌ని మీడియా ప్ర‌తినిధులు కాస్టింగ్ కౌచ్‌పై ప్రశ్నించారు. దీనిపై స్పందించిన స‌రోజ్ ఖాన్ ఒక్క సినిమా రంగంలోనే ఇది లేదు అన్ని రంగాల‌లోను ఉంది. ప్రభుత్వ శాఖల్లో కూడా వేధింపుల ఉదంతాలు ఉన్నాయి కదా అని ఆమె గుర్తుచేశారు. అయిన‌ దీని వ‌ల‌న కొంద‌రికి తిండి దొరుకుతుంది. అస‌లు అమ్మాయిలు అమ్ముడుపోవాల్సిన అవసరమేముంది , టాలెంట్ ఉంటే ఆఫ‌ర్స్ అవే వెతుక్కుంటూ వ‌స్తాయి. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారాల్లో అమ్మాయిల నిర్ణయమే కీలకం. మళ్లీ చెబుతున్నా.. ఇది ఒక్క సినిమా రంగానికే సంబంధించిన వ్యవహారమే కాదు యావత్‌ సమాజానికి సంబంధించింది. దయచేసి ఇండ‌స్ట్రీని బ్లేమ్ చేయోద్దు అని కోరుతున్నాను అని స‌రోజ్ ఖాన్ అన్నారు.

2090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles