విష‌మంగా ఉన్న మాధ‌వ‌న్ ఆరోగ్యం

Sat,November 17, 2018 10:59 AM
Veteran Actor TP Madhavan health condition Critical

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు టీపీ మాధ‌వ‌న్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. 40 సంవ‌త్స‌రాలు వ‌య‌స్సులో న‌టించ‌డం మొద‌లు పెట్టిన మాధ‌వ‌న్ 600కి పైగా సినిమాల‌లో ముఖ్య పాత్ర‌లు పోషించారు. విల‌న్ పాత్ర‌ధారిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాధ‌వ‌న్ త‌ర్వాత కామెడీ పాత్ర‌లు కూడా చేశాడు. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ రోల్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 82 సంవ‌త్స‌రాలు కాగా, అనారోగ్యంతో కొట్ట‌ర‌క్క‌రాలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌నకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం హ‌రిద్వార్‌ని సంద‌ర్శించిన ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యాడు. అప్ప‌టి నుండి గాంధీభ‌వ‌న్ ప‌త‌న‌పురంలోనే ఉంటున్నాడు. త‌న భార్య నుండి విడిపోయిన త‌ర్వాత మాధ‌వ‌న్ కుటుంబ స‌భ్యుల‌తో స‌రైన సంబంధాలు కొన‌సాగించ‌లేదు. మాధ‌వ‌న్ త‌న‌యుడు రాజా కృష్ణ మీన‌న్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు.

5303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS