బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత

Mon,December 4, 2017 06:21 PM
Veteran actor ShashiKapoor passes away in Mumbai at the age of 79

ముంబై : బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ.. 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించింది. దివార్, కభీకభీ, సిల్‌సిలా, అవారా, సత్యం శివం సుందరం, నమక్ హలాల్, కాలపత్తర్, రోటి కప్‌డా ఔర్ మకాన్ లాంటి హిట్ సినిమాల్లో శశికపూర్ నటించి విశేష ఆదరణ పొందారు.

3560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles