అల‌నాటి న‌టి క‌న్నుమూత‌

Tue,July 17, 2018 11:48 AM
Veteran actor Rita Bhaduri passes away yestreday night

ఇటు సినిమాలు అటు సీరియల్స్‌తో హిందీలో ఫుల్ పాపుల‌ర్ అయిన న‌టి రీటా భాదురి. కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న రీటా భాదురి(62) సోమ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా ఆమె డ‌యాల‌సిస్‌పైనే ఆధార‌ప‌డి ఉన్నారు. ప‌ది రోజుల కింద‌ట ముంబైలోని విలే ప‌ర్లే ప్రాంతంలో ఉన్న సుజ‌య్ హాస్పిట‌ల్‌లో రీటాని చేర్చారు. పరిస్థితి చేయి దాట‌డం వ‌ల‌న ఆమె మ‌ర‌ణించింద‌ని రాజి న‌టుడు శిశిర్ శ‌ర్మ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలలో ఎక్కువ పాత్ర‌లు పోషించి త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకంది రీటా. గుజ‌రాతీ చిత్రాల‌లోను న‌టించిన ఆమె స‌రభాయ్ వ‌ర్సెస్ స‌ర‌భాయ్, కుంకుం, అమ‌న‌ట్ వంటి టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించింది. స్టార్ భ‌ర‌త్ షో నిమికి ముకియాలో అమ్మ‌మ్మ పాత్ర పోషించిన ఆమె బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. కబీ హాన్‌ కబీ నా, క్యా కహెనా, దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో మెప్పించిన రీటా మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు బాలీవుడ్ ప్రముఖులు కోరుతున్నారు. నేటి సాయంత్రం అంధేరీలో రీటా భాదురి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

3798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles