మోదీ ప్ర‌మాణం.. క‌మ‌ల్‌హాస‌న్‌కు ఆహ్వానం

Mon,May 27, 2019 03:12 PM
Veteran Actor Kamal Haasan  invited for the swearing in ceremony of PM Narendra Modi on May 30

హైద‌రాబాద్‌: న‌రేంద్ర మోదీ ఈనెల 30వ తేదీన రెండవ‌సారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వేడుక‌కు హాజ‌రుకావాలంటూ త‌మిళ‌నాడుకు చెందిన మ‌క్క‌ల్ నీధి మ‌యిం పార్టీ అధ్య‌క్షుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు ఆహ్వానం అందింది. 30వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో మోదీ ప్రమాణం చేయ‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. మోదీతో ప్ర‌మాణం చేయిస్తారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి 352 సీట్లు గెలుచుకున్న‌ది. బీజేపీ ట్రిపుల్ సెంచ‌రీ(303) కొట్టిన విష‌యం తెలిసిందే. నాథూరామ్ గాడ్సే మొట్ట‌మొద‌టి హిందూ ఉగ్ర‌వాది అని ఎన్నిక‌ల వేళ క‌మ‌ల్‌హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న‌కు ఎన్నిక‌ల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది.

2427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles