సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న 'వెన్నుపోటు' సాంగ్

Sat,December 22, 2018 08:03 AM
Vennupotu Full Song released

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రంతో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌ల కాగా, తాజాగా వెన్నుపోటు అనే సాంగ్‌ని విడుద‌ల చేశాడు. దొంగప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు అంటూ సాగుతున్న లిరిక్స్‌పై సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. బాల‌య్య నిర్మిస్తున్న‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో వేడుక‌కి కొద్ది నిమిషాల ముందే వెన్నుపోటు అనే సాంగ్‌ని విడుద‌ల చేసి అంద‌రి అటెన్ష‌న్‌ని త‌న‌వైపుకి తిప్పుకున్నాడు వ‌ర్మ‌. రిలీజ్‌ చేసిన గంటలోనే ఈ సాంగ్‌కి దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ముంబై వ్యాపారవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోన్న సినిమాను రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

4588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles