లవంగం2 గా వెన్నెల కిషోర్..!

Sun,March 31, 2019 09:35 AM

మన్మ‌థుడు చిత్రంతో టాలీవుడ్ మ‌న్మ‌థుడుగా మారిన నాగార్జున త్వ‌ర‌లో మ‌న్మ‌థుడు 2 ప్రాజెక్ట్‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని చిల‌సౌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించ‌నున్నాడు. క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నుంది . తొలిసారి ర‌కుల్‌.. నాగ్‌తో జ‌త‌క‌ట్టనుండ‌డంతో ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. పీ కిర‌ణ్‌తో క‌లిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఆద్యంతం వినోదభరితంగా సాగే మన్మథుడు 2 చిత్రం త్వరలో యూరప్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే మ‌న్మ‌థుడు చిత్రంలో ల‌వంగం పాత్ర‌తో ప్రేక్ష‌కుల పొట్ట చెక్క‌లయ్యేలా న‌వ్వించిన బ్ర‌హ్మానందం సీక్వెల్‌లో లేడ‌ట‌. ఆయ‌న పాత్ర‌లో వెన్నెల కిషోర్ ఎంపికైన‌ట్టు చెబుతున్నారు. ఇటివ‌లి కాలంలో వెన్నెల కిషోర్ కామెడీని తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ని బ్ర‌హ్మీ స్థానంలో ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles