డిసెంబర్ లోనే 'వెంకీమామ' సందడి

Mon,December 2, 2019 10:19 PM

హైదరాబాద్ : విక్ట‌రీ వెంక‌టేష్, నాగ చైత‌న్య కాంబినేషన్ లో వస్తోన్న తాజా చిత్రం 'వెంకీమామ'. కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకుడు. వెంకీ పుట్టినరోజు డిసెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్లు అయిన చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోనూ మామ అల్లుళ్ళుగా కనిపించి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles