‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ’

Thu,November 7, 2019 08:29 PM


విక్ట‌రీ వెంక‌టేష్, నాగ చైత‌న్య కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం వెంకీమామ‌. కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ..నా ధైర్యం, నాసైన్యం నువ్వేలే వెంకీమామ’ అంటూ సాగే ఈ పాట మామ, అల్లుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.


ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్లు అయిన చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోనూ మామ అల్లుళ్ళుగా కనిపించి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

1196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles