విశాఖ ఆసుప‌త్రిలో విక్ట‌రీ వెంక‌టేష్‌..!

Fri,January 25, 2019 10:23 AM
venky suffered with back pain

ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వెంకీ మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్ళీ త‌న కామెడీ ట్రాక్‌తో ప్రేక్షకుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించాడు. ఇక త్వ‌ర‌లో త‌న మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎఫ్ 2 సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న చిత్రంలోను వెంకీ న‌టించ‌నున్నాడు. అయితే కొద్ది రోజులుగా తీవ్ర వెన్నునొప్పి కార‌ణంతో ఇబ్బందిప‌డుతున్న వెంక‌టేష్ విశాఖపట్నంలోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గత కొన్నాళ్లుగా వెంకీ వెన్నునొప్పితో బాధపడుతుండ‌గా, ఎఫ్ 2 చిత్ర రిలీజ్ త‌ర్వాత ఆయ‌న మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారట‌. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకోనున్న ఆయ‌న వైద్యం పూర్తి అయిన త‌ర్వాత తిరిగి హైద‌రాబాద్‌కి రానున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వెంక‌టేష్‌తో పాటు కొంద‌రు కుటుంబస‌భ్యులు ఆయ‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తుంది. డిశ్చార్జ్ అయిన త‌ర్వాత కూడా వెంకీ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించార‌ట‌. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరువైంది.

14647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles