డుకాటి బైక్‌ షోరూం ప్రారంభించిన మామ-అల్లుళ్లు

Fri,April 26, 2019 07:00 PM
Venky, Naga chaitanya inaugurates Ducati bike showroom


హైదరాబాద్ : టాలీవుడ్ యాక్టర్లు వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య డుకాటి బైక్ షోరూంను ప్రారంభించారు. ప్రముఖ బైకుల తయారీ సంస్థ డుకాటి ఇండియా తాజాగా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని బంజారా హిల్స్‌ రోడ్‌ నెం.12లో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను వెంకటేశ్ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించాడు. ఆ తర్వాత ఫోర్ న్యూ స్క్రాంబ్లర్‌ మోడల్స్‌లో స్క్రాంబ్లర్‌ ఐకాన్‌, డెసర్ట్‌ స్లెడ్‌, ఫుల్‌ థ్రోటెల్‌, కేఫ్‌ రేసర్‌ బైకులను చైతు లాంచ్ చేశాడు. షోరూమ్ ను ప్రారంభించేందుకు వచ్చిన మామా అల్లుళ్లను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వెంకటేష్, నాగ చైతన్య కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

2433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles