అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యాన్స్‌కి ఉగాది గిఫ్ట్

Fri,April 5, 2019 12:48 PM
Venky Mama title logo release time fixed

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో వెంకీ మామ ఒక‌టి. ద‌గ్గుబాటి వెంక‌టేష్‌, అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 24 సెట్స్‌పైకి వెళ్లింది.తొలి షెడ్యూల్ రాజ‌మండ్రి పరిస‌ర ప్రాంతాల‌లో తెర‌కెక్కించారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా క‌నిపించనున్నారు. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాని కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వెంకీ మామ చిత్రం పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతుండ‌గా ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ , చైతు కు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా అభిమానుల‌కి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చేందుకు టీం సిద్ధ‌మైంది. ఈ రోజు సాయంత్రం 4.05ని.ల‌కి చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ‌. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు.

2046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles