వెంకీమామ ఇంట్రో సీన్ వీడియో లీక్‌..!

Wed,February 27, 2019 01:41 PM
Venky Mama scene leaked

మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌తో మంచి హిట్స్ కొడుతున్న విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 24న‌ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌గా, రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. గోదావరి నది తీరాన వెంకీ , చైతూ లపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించగా, ఓ వ్య‌క్తి ఆ స‌న్నివేశాన్ని ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. 26 సెక‌న్లు గ‌ల ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌డ‌వ దిగి వ‌స్తున్న మేన‌ల్లుడిని రిసీవ్ చేసుకున్న వెంకీ ఆ త‌ర్వాత ఇంటికి తీసుకెళ్ల‌డం వంటి స‌న్నివేశాల‌ని ఆ క్లిప్‌లో చూడొచ్చు.

చిత్రంలోను వెంకీ, చైతూలు మామ అల్లుళ్ళుగా క‌నిపించనున్నారు. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాని కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు. పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ , చైతు కు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.2839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles