నేటి నుండి వెంకీ మామ హంగామా

Sun,February 24, 2019 07:44 AM
venky mama hungama starts from today

టాలీవుడ్‌లో మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ నేటి నుండి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. నాగ చైత‌న్య‌, వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బాబీ తెర‌కెక్కించ‌నున్న చిత్రం వెంకీ మామ‌.ఇందులో వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, చైతూ స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టిస్తుంది. వెంకీ మామ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంద‌ని స‌మాచారం. నిజ‌జీవితంలో మాదిరిగానే చిత్రంలోను వెంకీ, చైతూలు మామ అల్లుళ్ళుగా క‌నిపించనున్నారు. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాని కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఎఫ్‌2 అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన వెంక‌టేష్ ఈ మ‌ల్టీ స్టార‌ర్‌తోను ప్రేక్ష‌కుల‌ని మ‌రింత‌గా అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. ఇంకా చైతూ న‌టించిన మ‌జిలి చిత్రం ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

1813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles