'వెంకీ మామ' ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

Sat,April 6, 2019 07:08 AM
Venky Mama first look released

వ‌రుస మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న వెంక‌టేష్ తాజాగా త‌న మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ని ఉగాది పండుగ సంద‌ర్భంగా కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఇందులో త‌న మామ భుజంపై చైతూ చేయి వేయడం, ప‌క్క‌న ఉన్న బుల్లెట్ పై జై జ‌వాన్ అని రాసి ఉండ‌డం మ‌నం గమ‌నించ‌వ‌చ్చు. ఈ చిత్రం ఓ వైపు పల్లెటూరి వాతావరణం.. మరోవైపు యుద్దవాతావరణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ట్ట‌గా స‌మాచారం. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా ఈ చిత్రంలో క‌నిపించ‌డం విశేషం. అయితే మామ‌ రైస్‌మిల్‌ యజమాని పాత్రలో సంద‌డి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

1193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles