వెంకీ మామ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేష్ చిత్రం

Fri,January 11, 2019 09:58 AM

సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ఒక వైపు మ‌ల్టీ స్టార‌ర్స్ చేస్తూనే మ‌రో వైపు సోలోగా సినిమాలు చేస్తున్నాడు. వెంక‌టేష్‌- వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంద‌ని యూనిట్ చెబుతుంది. అయితే ఎఫ్ 2 రిలీజ్ త‌ర్వాత వెంకీ చేయ‌బోవు ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన‌గా దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంక‌టేష్‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్యతో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌బోతున్న‌ట్టు తెలిపాడు వెంకటేష్‌. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత మాస్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ ఉంటుంద‌ని స‌మాచారం. వినాయ‌క్ .. బాల‌య్య‌తో సినిమా చేస్తాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి, ఇప్ప‌ట్లో అది జ‌రిగేలా లేదు. దీంతో వెంకీ- వినాయ‌క్ క‌లిసి ల‌క్ష్మీ చిత్రం త‌ర‌హాలో ఓ మూవీ చేయ‌నున్నార‌ని టాక్. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా వెంక‌టేష్ ఓ క‌థ‌ని సిద్ధం చేస్తున్నాడట‌. మ‌రి ఈ ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో, ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో చూడాలి.

2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles