జూన్‌లో వెంకీ, వ‌రుణ్‌ల సంద‌డి మొద‌లు

Sun,April 15, 2018 12:08 PM
venky and varun fun starts on june

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెరకెక్క‌నున్న చిత్రం ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ మూవీ జాన్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అనీల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. చిత్రంలో వరుణ్ తేజ్ పక్కన మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం వెంక‌టేష్, తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఆట‌నాదే వేట‌నాదే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక అంత‌రిక్షం నేప‌థ్యంలో సంక‌ల్ప్ రెడ్డి తీయ‌బోవు చిత్రం కోసం వ‌రుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నాడు. హ్య‌ట్రిక్ విజ‌యాలు సాధించిన అనీల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రంతో మ‌రో విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS