అజ్ఞాతవాసిలో వెంకీ పాత్ర ఇలా ఉంటుందా..!

Thu,December 28, 2017 05:18 PM
venki role in agnathavasi very intresting

తొలిసారి అజ్ఞాతవాసి అనే చిత్రంతో సంక్రాంతికి వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. ఇక విక్టరీ హీరో వెంకటేష్ కూడా ఈ చిత్రంలో కొద్ది సేపు కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది. కామెడీ సీన్ లో పవన్ కి మేనమామగా కనిపించనున్నాడని కొందరు అంటుంటే, యాక్షన్ సీన్ లో 4 నిమిషాల పాటు వీరంగం సృష్టిస్తాడని మరి కొందరు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఇటు పవన్, అటు వెంకీ అభిమానులు ఈ సన్నివేశంపై పలు ఊహాగానాలు చేస్తున్నారు. పవన్ –వెంకీ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల మల్టీ స్టారర్ చిత్రం గొప్ప విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అభిమానులలో ఆసక్తి నెలకొంది. అజ్ఞాతవాసి చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. పవన్ పాడిన కొడకా కోటేశ్వరా సాంగ్ ను నూతన సంవత్సర కానుకగా డిసెంబరు 31న విడుదల చేయబోతున్నారు. ఇక జనవరి 4 లేదా 5వ తారీకుల్లో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

2614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles