అజ్ఞాత‌వాసిలో వెంకీ ఎంట్రీకి కాస్త టైం ఉంద‌ట‌..!

Wed,January 10, 2018 11:52 AM
venki character should be added in later

తొలిసారి అజ్ఞాతవాసి అనే చిత్రంతో సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. ఇక విక్టరీ హీరో వెంకటేష్ కూడా ఈ చిత్రంలో కొద్ది సేపు కనిపిస్తాడ‌నే ప్రచారం కొద్ది రోజుల నుండి జ‌రుగుతూ వ‌చ్చింది. ఓ కామెడీ సీన్ లో పవన్ కి మేనమామగా కనిపించనున్నాడని కొందరు చెప్తే, యాక్షన్ సీన్ లో 4 నిమిషాల పాటు వీరంగం సృష్టిస్తాడని మరి కొందరు అన్నారు. కాని సినిమా రిలీజ్ త‌ర్వాత అజ్ఞాతవాసి చిత్రంలో వెంకీ ఎక్క‌డ క‌నిపించ‌కపోయే స‌రికి వెంకీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే చిత్ర షూటింగ్‌లో వెంక‌టేశ్ పాల్గొన్నాడ‌ని, ఆయ‌న‌కి సంబంధించిన కొన్ని సీన్స్ రానున్న రోజుల‌లో యాడ్ చేస్తార‌ని ఓ టాక్ న‌డుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. పవన్ –వెంకీ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల మల్టీ స్టారర్ చిత్రం గొప్ప విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.

2745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles