ఎఫ్‌2లో వెంకీ, వ‌రుణ్‌ల పాత్ర‌ల‌పై ఓ క్లారిటీ..!

Wed,June 20, 2018 10:28 AM
venki and varun plays brother role in f2 movie

విక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. దేవి శ్రీ చిత్రానికి సంగీతం అందించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల‌ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు అనీల్ రావిపూడి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకోగా, ఈ నెల 23వ తేదీన సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 30వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును హైదరాబాద్ లో మొదలుపెట్టి .. జూలై 20వ తేదీ వరకూ నాన్ స్టాప్ గా జరపనున్నారు. అయితే ఈ సినిమాలో వెంకీ ,వరుణ్‌లు తోడల్లుళ్లుగా క‌నిపించి ఫుల్ ఎంట‌ర్‌టైన్ అందించనున్న‌ట్టు తెలుస్తుంది. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డి మూవీతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత ఎఫ్ 2టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు టాక్.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles