ఒకే వేదిక‌ని పంచుకోనున్న‌ వెంక‌టేష్‌, నాగార్జున‌

Sat,March 30, 2019 08:48 AM

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోస్ విక్టరీ వెంకటేష్‌, కింగ్ నాగార్జున ఒకే వేదిక‌ని షేర్ చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మ‌ధ్య కాలంలో వెంకీ, నాగ్‌ని ఒకే స్టేజ్‌పై చూసిన సంద‌ర్భాలు చాలా త‌క్కువనే చెప్పాలి. ఇప్పుడు ఈ అరుదైన ఘ‌ట్టానికి మ‌జిలీ ప్రీ రిలీజ్ వేడుక వేదిక కానుంది. టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌ అక్కినేని నాగచైతన్య, సమంత నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల జోరు పెంచిన చిత్ర యూనిట్ ఈనెల 31న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కావడం విశేషం. ఇదే వేడుకలో వీరిద్దరూ కలిసి చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్, సుబ్బరాజ్, పోసాని క్రిష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.

3082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles