వెంకీ ఖాతాలో మరో మ‌ల్టీ స్టార‌ర్

Sat,September 29, 2018 09:49 AM

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల జోరు పెంచిన న‌టుడు విక్ట‌రీ వెంక‌టేష్‌. మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో వెంకీ చేసిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ ట్రెండ్ జోరందుకుంది. ప్ర‌స్తుతం వెంకీ.. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఇదిలా ఉండగా ఆయన మరో నాలుగు చిత్రాల్ని అంగీకరించి నట్లు తెలిసింది. ఇందులో కేఎస్ రవీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో చైతూతో క‌లిసి మ‌ల్టీ స్టారర్ చేయ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో అర‌వింద స‌మేత అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లో వెంక‌టేష్‌తో మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేశాడ‌ట‌. వీటితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం..త్రినాథరావు నక్కిన రూపొందించనున్న సినిమాతో పాటు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ వెంకటేష్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి వెంక‌టేష్ డైరీ మాత్రం వ‌చ్చే సంవ‌త్స‌రానికి కూడా ఫుల్ అయిన‌ట్టు తెలుస్తుంది.

2883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles