నేడు పెళ్ళి పీట‌లెక్క‌నున్న వెంకీ కూతురు.. ఘ‌నంగా జ‌రిగిన ప్రీ వెడ్డింగ్

Sun,March 24, 2019 07:46 AM

ద‌గ్గుబాటి వెంక‌టేష్ కూతురు ఆశ్రిత పెళ్లి వేడుక నేడు రాజ‌స్థాన్‌లో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ద‌గ్గుబాటి ఫ్యామిలీ అంతా అక్క‌డికి చేరుకోగా, నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి చైతూ, సామ్‌తో పాటు స‌ల్మాన్ ఖాన్‌, మ‌రి కొంత‌మంది స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు. సోష‌ల్ మీడియాలో చైతూ ఫోటోతో పాటు స‌ల్మాన్‌ఖాన్‌కి సంబంధించిన ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చైతూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్ లొకేష‌న్‌లో స‌మంత‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ వెడ్డింగ్ చిల్లింగ్ అనే కామెంట్ పెట్టాడు. చాలా గోప్యంగా ఈ వివాహ వేడుక జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో ఆశ్రిత ఎంగేజ్‌మెంట్ కూడా సీక్రెట్‌గా జ‌రిపారు. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవ‌డు వినాయ‌క్ రెడ్డితో ఆశ్రిత ఏడ‌డుగులు వేయ‌నుండ‌గా, వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి కేవ‌లం స‌న్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు.


View this post on Instagram

Wedding chilling .. with the Mrs

A post shared by Chay Akkineni (@chayakkineni) on

4363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles