కూతురి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంకీ..!

Sun,September 23, 2018 08:59 AM
Venkatesh daughter Aashritha to get married soon

టాలీవుడ్ విక్ట‌రీ హీరో వెంక‌టేష్ త్వ‌ర‌లో త‌న కూతురి వివాహ వేడుక‌ని అంగ‌రంగ వైభవంగా జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. వెంకీ కూతురు ఆశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమాయ‌ణంలో ఉంద‌ట‌. ఇదే విష‌యాన్ని రీసెంట్‌గా త‌న కుటుంబ స‌భ్యుల‌కి చెప్ప‌డంతో వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వెంక‌టేష్ సోద‌రుడు సురేష్ బాబు ఇప్ప‌టికే అబ్బాయి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చార‌ని, త్వ‌ర‌లో వీరిరివురి నిశ్చితార్దం జ‌ర‌గ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు అని తెలుస్తుంది. మరి ఆశ్రిత ప్రేమ పెళ్లి విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ కుటుంబ స‌భ్యులు ఎవ‌రు స్పందించ‌కపోగా, ఇంత‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. వెంకీ ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. త్వ‌ర‌లో చైతూ తో కూడా మ‌రో మల్టీ స్టార‌ర్ చేయాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం.

11127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS