ఒక చరిత్ర చెప్పాల్నంటే తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక: ఎఫ్2 టీజర్

Wed,December 12, 2018 06:35 PM

హ్య‌ట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న‌ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ మాస్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌తో మెహ‌రీన్ జ‌త‌క‌ట్టారు. ముంబై ప్రాంతానికి సంబంధించిన క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు.


సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈసినిమా టీజర్‌ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. రేపు వెంకటేశ్ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ ఆధ్యంతం నవ్వులు పూయించేలా ఉంది. టీజర్ ప్రారంభమే.. ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. అదే ఒక మగాడి గురించి చెప్పాలంటే.. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత సార్.. అంటూ విక్టరీ వెంకటేశ్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఒక చరిత్ర చెప్పాల్నంటే.. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ కూడా సూపర్బ్. పండక్కి బాగా గట్టిగా నవ్వించేట్టున్నారుగా అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రావడం.. దానికి విక్టరీ, వరుణ్.. అంతేగా.. అంతేగా అంటూ వంతపాడటంతో టీజర్ పూర్తవుతుంది. అంటే సంక్రాంతి పండక్కి మనకు నవ్వులు ఖాయం అన్నమాట.

5870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles