మ‌హేష్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించిన వెంక‌య్య నాయుడు

Wed,May 15, 2019 08:25 AM
venkaiah naidu praise maharshi movie

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం మ‌హ‌ర్షిపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తూనే ఉంది. రైతుల స‌మస్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపించ‌గా, రీసెంట్‌గా భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చిత్రాన్ని కొనియాడారు. త‌న ట్విట్ట‌ర్‌లో వ‌రుస ట్వీట్స్ చేసిన వెంక‌య్య‌.. ‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అని త‌న ట్వీట్‌లో తెలిపారు వెంక‌య్య‌. గ‌తంలో కార్తీ హీరోగా తెర‌కెక్కిన చిన‌బాబుపై కూడా వెంక‌య్య ప్ర‌శంసలు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ కూడా రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌దే కావ‌డం విశేషం.

928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles