'చినబాబు'పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన ఉప రాష్ట్ర‌ప‌తి

Tue,July 17, 2018 01:07 PM
Venkaiah Naidu praise china babu movie

సూర్య సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ ఆన‌తి కాలంలోనే త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివ‌రిగా ఖాకీ చిత్రంతో అల‌రించిన కార్తీ తాజాగా చిన‌బాబు చిత్రంతో మ‌రోసారి అల‌రించాడు. త‌మిళంలో ‘కడియకుట్టి సింగం’ పేరుతో 2డి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మాతగా సినిమా రూపొందింది. తెలుగులో ఈ చిత్రాన్ని చిన‌బాబు పేరుతో విడుద‌ల చేసారు. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయేష హీరోయిన్. సత్యరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. జూలై 13న విడుద‌లైన ఈ చిత్రం రైతుల స‌మస్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. రైతుల సమస్యలను చర్చిస్తూనే.. కామెడీ, యాక్షన్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మార‌థం ప‌ట్టారు. తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు కూడా చిన‌బాబు సినిమా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గిన చిత్రం అని కితాబిచ్చారు.

ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా “చినబాబు”. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాద భరితంగా రూపొందిన “చినబాబు” సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అంటూ వెంక‌య్య నాయుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిన‌బాబు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనం, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో “చినబాబు” చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు’ అని ఉపరాష్ట్రపతి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెంకయ్య ట్వీట్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో వెంకయ్య ట్వీట్లు చేయ‌డం విశేషం.

చినబాబు చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ప‌ట్ల చిత్ర నిర్మాత సూర్య ఆనందం వ్య‌క్తం చేస్తూ స్పందించారు. స‌ర్‌..ఇది మాకో స‌త్కారం.. మీలాంటి గొప్ప వ్య‌క్తి స‌మ‌యం కేటాయించి సినిమా చూడ‌డం, మా సినిమాని ఇంత‌గా ప్ర‌శంసించ‌డం చాలా ఆనందంగా ఉందని సూర్య తెలిపారు. మీ ట్వీట్‌తో మా చిత్ర బృందం మొత్తం ఆనందంగా ఉందంటూ ట్వీట్‌లో తెలిపార సూర్య‌. చినబాబు చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర స‌క్సెస్ మీట్‌ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.
4213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles