ఆస‌క్తి రేకెత్తిస్తున్న మ‌ల్టీ స్టారర్ మూవీ ట్రైల‌ర్

Tue,October 16, 2018 08:21 AM
Veera Bhoga Vasantha Rayalu Trailer

జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న హీరో నారా రోహిత్‌. ప్ర‌స్తుతం ఈ న‌టుడు శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియా శ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి వీర‌భోగ వసంత రాయలు అనే సినిమా చేస్తున్నాడు. దేశంలోని మత విధానాలకు సంబంధించిన చిత్రంగా ‘వీరభోగ వసంతరాయలు’ ఉంటుంద‌ని తెలుస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. కొంద‌రు హైజాక‌ర్స్ ఫ్లైట్‌ని హైజాక్ చేయ‌గా, వారి నుండి ప్రయాణికుల‌ని త‌ప్పించే క్ర‌మంలో మ‌న హీరోలు చేసే ఆప‌రేష‌న్‌ని ఆస‌క్తిగా తెర‌కెక్కించారు. ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. అక్టోబ‌ర్ 26న చిత్రం విడుద‌ల కానుంది. ఇంద్ర‌సేన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అప్పారావు నిర్మిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles