టీజ‌ర్‌తో అద‌ర‌గొట్టిన నారా వార‌బ్బాయి

Tue,August 21, 2018 09:45 AM
Veera Bhoga Vasantha Rayalu Teaser released

జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న హీరో నారా రోహిత్‌. ప్ర‌స్తుతం ఈ న‌టుడు శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియా శ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి వీర‌భోగ వసంత రాయలు అనే సినిమా చేస్తున్నాడు. దేశంలోని మతవిధానాలకు సంబంధించిన చిత్రంగా ‘వీరభోగ వసంతరాయలు’ ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య పాత్ర‌ల‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇవి అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఇక తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ‘నాకు తెలుసు.. మీరు వారి రాకకోసం ఎన్ని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారో అని. నాకు తెలుసు.. వాళ్లు ఎలాగైనా వస్తారని మీరు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అని. ఎందుకంటే మీలాగే ఎదురుచూసే వాళ్లలో నేనూ ఒకడిని కాబట్టి. ఎదురు చూశాం.. ఎదురు చూశాం. క్షణాలు కాదు.. నిమిషాలు కాదు.. గంటలు కాదు.. రోజులు కాదు.. నెలల తరబడి ఎదురు చూశాం. కానీ వాళ్లు మాత్రం తిరిగిరాలేదు’ అంటూ నారా రోహిత్ మీడియాతో చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. టీజ‌ర్ చాలా ఆస‌క్తికరంగా ఉండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. నారా రోహిత్ న‌టించిన ఆట‌గాళ్ళు చిత్రం ఆగ‌స్ట్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రాన్ని కూడా వీలైనంత తొంద‌ర‌లోనే విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు మేక‌ర్స్‌.

1802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles