మూడు నెలలు కుట్టుమిషన్ నేర్చుకున్న హీరో

Thu,August 23, 2018 04:57 PM
varundhavan took 3 months for tailoring classes

ముంబై: బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్‌ధవన్, అనుష్క శర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సూయీ ధాగా. మేడ్ ఇన్ ఇండియా నేపథ్యంలో సాంప్రదాయ దుస్తుల ప్రాముఖ్యతను తెలియజేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో మౌజీ అనే దర్జీ పాత్రలో వరుణ్ ధవన్ కనిపించనున్నాడు. సినిమాలో తన పాత్ర కోసం టైలరింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు ధవన్. దర్జీ పాత్రకు న్యాయం చేసేందుకు మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్నాడు.

ఓ ముఖ్యమైన పాఠం నేర్చుకోవాల్సి ఉందని నాకు తెలుసు. దర్జీ పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు శిక్షణ తీసుకున్నా. సెట్స్‌లో కాస్ట్యూమ్ డిజైనర్ దర్శన్, నూర్ భాయి (టైలర్)నాకు ఎంతో సాయం చేశారు. టైలరింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు 3 నెలలు పట్టింది. ఒక్కోసారి 2 గంటలు, 4 గంటల సమయం టైలరింగ్ తరగతులకు కేటాయించేవాడిని. ఈ శిక్షణ కెమెరా ముందు దర్జీ పాత్రలో నటించేందుకు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఓ నటుడిగా తెరపై సవాలుతో కూడిన పాత్రలు చేయడమంటే నాకు ఇష్టం అని వరుణ్‌ధవన్ చెప్పాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది.


4085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles