వెంకీ స‌ర్‌తో చ‌ల్ల‌ని సాయంత్రం వేళ‌..

Sat,November 17, 2018 12:56 PM
varun tweet goes viral

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ్య‌ట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. మాస్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్ష‌కుల‌లో ఆనందాన్ని క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది ఫ్యాన్స్‌లో ఆనందాన్ని క‌లిగించింది. తాజాగా వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ లో వెంకీతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. వెంకీ స‌ర్‌తో చ‌ల్ల‌ని సాయంత్రం వేళ అనే కామెంట్ పెట్టాడు. బ్యాంకాక్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌తో మెహ‌రీన్ జ‌త‌క‌ట్టారు. ముంబై ప్రాంతానికి సంబంధించిన క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్నారు.


1428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles