నాపైన పందాలేస్తే గెలుస్తరు..నాతోటి పందాలేస్తే సస్తరు

Mon,September 9, 2019 06:28 PM
varun tej Valmiki trailer revealed


వరుణ్‌తేజ్‌ నటిస్తోన్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వాల్మీకి ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

‘ఈ మధ్యకాలంలో ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలెక్కడొస్తున్నాయంటూ ఓ ముసలావిడ చెప్పే డైలాగ్‌ తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఫాంహౌస్‌లో ఉన్న డాన్‌ని కాదురా..ఫాంలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకోవాలని అధర్వమురళి అంటున్నాడు. నాపైన పందాలేస్తే గెలుస్తరు..నాతోటి పందాలేస్తే సస్తరు. ఏమ్రో మనం బతుకుతున్నమని 10మందికి తెల్వకపోతే..ఇగ బతుకుడెందుకు రా’ అంటూ వరుణ్‌తేజ్‌ చెప్పే డైలాగ్స్‌ క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులు ఈలలు వేసేలా చేస్తున్నాయి. అధర్వ మురళి సినిమా దర్శకుడి పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతుండగా..వరుణ్‌తేజ్‌ పక్కా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ ఓ వైపు బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌..మరోవైపు మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అధర్వమురళి, మృణాళిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

2006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles