రెండు హిట్ల‌తో రెమ్యున‌రేష‌న్ పెంచిన మెగా హీరో..!

Fri,February 16, 2018 11:19 AM
varun tej raise his remuneration

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్నాడు. ఫిదా, తొలి ప్రేమ వంటి చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో వ‌రుణ్‌లో ఫుల్ కాన్ఫిడెంట్ పెరిగిన‌ట్టు తెలుస్తుంది. అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన తొలి ప్రేమ‌లో త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో విమ‌ర్శ‌కుల నోళ్ళు మూయించాడు ఈ మెగా హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హీరో రెండున్న‌ర కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో చేయ‌బోవు సినిమాకి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ని టాక్‌. ఘాజీ వంటి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం పొందిన డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డితో నెక్స్ట్ మూవీ చేయ‌నున్నాడు వ‌రుణ్‌. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, మూవీని మేలో సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంత‌రిక్షం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. తెలుగులో ఇలాంటి సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు.

2674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles