వాల్మీకిగా వ‌రుణ్‌.. ట్రెండ్ అవుతున్న న్యూ లుక్

Fri,April 19, 2019 08:50 AM
Varun tej new look in trending

నాగబాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ మంచి క‌థ‌ల‌ని ఎంచుకుంటూ వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్నాడు. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ గురువారం నుండి ప్రారంభ‌మైంది. తొలి రోజు షూటింగ్‌లో వ‌రుణ్ పాల్గొన్నాడు. అయితే త‌న లుక్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేసిన వ‌రుణ్ ‘సరికొత్త బాటలో వాల్మీకి’ అని ట్వీట్‌ చేశారు. ఇందులో వ‌రుణ్ లుక్ సరికొత్త‌గా ఉంది. గుబురు గ‌డ్డం, చెవి పోగు, క‌ళ్ళపై ప‌డుతున్న కర్లీ హెయిర్‌. ఈ లుక్ మాత్రం ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. తొలి పోస్ట‌ర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. త‌మిళంలో హిట్ అయిన జిగ‌ర్తాండ్రా మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది. మృణాళిని రవిని వాల్మీకిలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

1396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles