లాస్ ఏంజిల్స్‌లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వ‌రుణ్ తేజ్

Wed,February 6, 2019 12:15 PM
Varun Tej boxing practice at los angels

వ‌రుస విజ‌యాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న కుర్ర హీరో వ‌రుణ్ తేజ్‌. చివ‌రిగా ఎఫ్ 2 అనే చిత్రంతో ఆడియ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందించిన వ‌రుణ్ త‌న త‌దుప‌రి చిత్రంగా వాల్మీకి అనే చిత్రం చేయ‌నున్నాడు. గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. త‌మిళంలో హిట్ అయిన జిగ‌ర్తాండ్రా మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ప‌లువురి అమ్మాయిల‌ని ప‌రిశీలిస్తుండగా మృణాలినీ రవి, ఈషా రెబ్బా పేర్లు ఫ్రేమ్‌లోకి వ‌చ్చాయి. ఇక త‌మిళ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారట. అలాగే తమిళంలో సిద్ధార్థ్‌ చేసిన పాత్ర కోసం శ్రీవిష్ణు, నాగశౌర్యల‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం వ‌రుణ్ తేజ్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. లాస్ ఏంజిల్స్‌లో బాక్సింగ్‌కి సంబంధించి ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ట‌. త‌న ట్విట్ట‌ర్‌లో బాక్సింగ్ చేస్తున్న‌ట్టు ఓ ఫోటో పోస్ట్ చేశాడు వ‌రుణ్‌. అంటే చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. తెలుగు నేటీవిటికి త‌గ్గ‌ట్టుగా హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్ట్‌ని సిద్దం చేసుకోగా వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. వాల్మీకి చిత్రంతో మ‌రో హిట్ త‌న ఖాతాలో ఈ మెగా హీరో వేసుకుంటాడ‌ని అంటున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు.

2375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles