ఒలంపిక్ విన్న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న మెగా హీరో

Sat,March 9, 2019 01:15 PM
Varun Tej boxing practice

కెరీర‌ల్‌లో ఆచితూచి అడుగులేస్తున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. చివ‌రిగా ఎఫ్ 2 అనే చిత్రంతో ఆడియ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందించిన వ‌రుణ్ త‌న త‌దుప‌రి చిత్రంగా వాల్మీకి అనే చిత్రం చేయ‌నున్నాడు. గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళంలో హిట్ అయిన జిగ‌ర్తాండ్రా మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ప‌లువురి అమ్మాయిల‌ని ప‌రిశీలిస్తుండగా మృణాలినీ రవి, ఈషా రెబ్బా పేర్లు ఫ్రేమ్‌లోకి వ‌చ్చాయి. ఇక త‌మిళ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారట. అలాగే తమిళంలో సిద్ధార్థ్‌ చేసిన పాత్ర కోసం శ్రీవిష్ణు, నాగశౌర్యల‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటు మ‌రో సినిమాని లైన్‌లో పెట్టాడు వ‌రుణ్ తేజ్. కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అల్లు బాబీ ఈ సినిమాని నిర్మించ‌నున్నాడ‌ని అంటున్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు కిరణ్‌ కొర్రపాటి.. మిస్టర్, తొలిప్రేమ’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. అయితే ఈ సినిమా కోసం వ‌రుణ్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రం థ్రిల్ల‌ర్ స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కనుండ‌గా, ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించేందుకు ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో శిక్ష‌ణ పొందుతున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.

2161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles