వరుణ్-సంకల్ప్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్..

Sun,August 12, 2018 07:38 PM
Varun-sankalp concept poster revealed

టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్ ను, విడుదల తేదీని ఆగస్టు 15న ఉదయం 9.30కి ప్రకటించనున్నట్లు సంకల్ప్ టీం పోస్టర్ ద్వారా తెలిపింది. ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో జీరో గ్రావిటీ టెక్నాలజీతో వేయబడిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిగింది.

ఈ చిత్రం వరుణ్ తేజ్ , టీమ్ సభ్యులంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు. అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండగా.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

2406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles