పిల్ల‌ల‌తో 'అంత‌రిక్షం' టీం

Tue,September 25, 2018 09:39 AM
varun and lavanya with Anthariksham team

ఘాజీ చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం పొందిన డైరెక్టర్ సంక‌ల్ప్ రెడ్డి ప్రస్తుతం వరుణ్‌ తేజ్, అదితిరావు హైద‌రి, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో అంత‌రిక్షం అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం వరుణ్‌ వ్యోమగామిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. డిసెంబ‌ర్ 21న చిత్రం విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్‌, అదితి రావులు వ్యోమ‌గామిగా కనిపించ‌నున్నారని టాక్. తాజాగా చిత్ర షూటింగ్‌కి సంబంధించిన ఓ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో వ‌రుణ్‌, లావ‌ణ్య‌లు పిల్ల‌ల‌తో క‌లిసి ఫోటోల‌కి ఫోజులిచ్చారు. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. ఈ మూవీకి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌ ఛాయా గ్రాహకుడు

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles