ప్రేక్ష‌కుల ముందుకు 'వర్షం' కాంబినేష‌న్..!

Tue,November 27, 2018 10:10 AM
varshma combination repeat again

కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం వ‌ర్షం. ప్ర‌భాస్, త్రిష జంట‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో గోపిచంద్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించాడు. ఈ చిత్రం త‌ర్వాత గోపిచంద్ హీరోగా బిజీ అయ్యాడు. వ‌ర్షం చిత్రంలో ప్ర‌భాస్, గోపిచంద్ మ‌ధ్య ఉండే కొన్ని సీన్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. ఈ కాంబినేష‌న్‌ని మ‌రో సారి తెర‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వ‌ర‌లో మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా చూడ‌బోతార‌ని అన్నాడు. మ‌ల్టీ స్టార‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రం కోసం ప‌క్కా స్క్రిప్ట్ సిద్ధం కావాలని ఆయ‌న అన్నారు. వ‌ర్షం త‌ర్వాత వెండితెర‌పై ప్ర‌భాస్‌, గోపిచంద్‌లు క‌నిపించ‌క‌పోయిన ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం వారిద్ద‌రు రెగ్యుల‌ర్‌గానే టచ్‌లో ఉంటారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు ఓ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఇక గోపిచంద్ త్వ‌ర‌లో శ్రీవాస్‌, సంప‌త్ సినిమాల‌లో న‌టించ‌నున్నాడు. మ‌రి ప్ర‌భాస్, గోపిచంద్‌ల మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ కి సంబంధిచిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

2954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles