ఆ నిర్ణ‌యంతో షాక్ అయ్యాను : 'వ‌ర్మ' హీరోయిన్

Sat,February 9, 2019 09:36 AM
Varmaa actress Megha Chowdhury shocking comments

ప్ర‌ముఖ న‌టుడు విక్ర‌మ్ కుమారుడు ధృవ్ హీరోగా త‌మిళంలో వ‌ర్మ అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ని అర్ధాంత‌రంగా ఆపేస్తున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్’ తాజాగా ప్ర‌క‌టించింది. ఫైన‌ల్ అవుట్ పుట్ ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న మేము సినిమా షూటింగ్‌ని పూర్తి చేసి మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌టి నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుపుతామ‌ని అన్నారు. అంతేకాదు హీరో త‌ప్ప ద‌ర్శ‌కుడితో పాటు న‌టీన‌టులు అంద‌రు మార‌తార‌ని కూడా చెప్పుకొచ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న వ‌ర్మ చిత్ర క‌థానాయిక మేఘా చౌద‌రి తాజాగా స్పందించింది. రీ షూట్‌కి సంబంధించి నాకెలాంటి స‌మాచారం ఇవ్వలేదు. వార్త‌ల‌లో విని షాక్ అయ్యాను. చిత్రానికి సంబంధించిన వారితో త్వ‌ర‌లోనే మాట్లాడుతాను అని చెప్పింది. వ‌ర్మ ద‌ర్శ‌కుడు బాల చిత్రానికి కో ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడ‌ట‌. ఈ4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, బాల‌కి మ‌ధ్య స్క్రిప్ట్ విష‌యంలో జ‌రిగిన వివాదంలో మూవీని రీషూట్ చేస్తున్న‌ట్టు కోలీవుడ్ టాక్. రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డి జూన్‌లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తామ‌ని ‘ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles