ఆర్జీవి స్కూల్‌కి సంబంధించిన వివ‌రాలు కొద్ది గంట‌ల‌లో..

Sun,May 27, 2018 11:06 AM
varma statrs new film institute

శివ సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న వ‌ర్మ ఇండ‌స్ట్రీకి కొత్త టెక్నాల‌జీస్‌ని ప‌రిచ‌యం చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్పుడు ఓ ఫిలిం స్కూల్‌ని కూడా ప్రారంభించ‌బోతున్నాడు. న్యూయార్క్‌ కు చెందిన డాక్టర్‌ రామ్‌ స్వరూప్‌, డాక్టర్‌ శ్వేతా రెడ్డిలతో కలిసి ఆర్జీవీ అన్‌స్కూల్‌ పేరుతో ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్రకటించారు ఆర్జీవి. ఈ స్కూల్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తార‌ట‌. వ‌ర్మ తెర‌కెక్కించిన ఆఫీస‌ర్ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీకి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. నాగార్జున‌, మైరా స‌రీన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని వ‌ర్మ త‌న ఓన్ బేన‌ర్ కంపెనీ పై నిర్మించ‌డం విశేషం. ఈ చిత్రంతో వ‌ర్మ త‌న పూర్వ వైభ‌వాన్ని అందుకుంటాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.


2460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS