త‌ల్లితో దిగిన ఫోటో షేర్ చేసిన వ‌ర్మ‌

Thu,September 14, 2017 12:20 PM
varma shares his mother pic in social media

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాని వాడ‌కుండా గ‌డిపిన రోజు లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. స‌మాజంలో జ‌రుగుతున్న ప్రతి విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా చ‌ర్చిస్తుంటాడు వ‌ర్మ‌. ఈ నేప‌ధ్యంలో ప‌లు వివాదాలని సృష్టిస్తుంటాడు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి సినిమాకి సంబంధించి వ‌రుస పోస్ట్‌లు చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ రీసెంట్‌గా త‌న తల్లి ఫోటోని షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వ‌ర్మ త‌న త‌ల్లి ఫోటోని ప‌రిచ‌యం చేయ‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. త‌న‌ త‌ల్లి సూర్య‌మ్మ‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. ఆ అందమైన మహిళ మా అమ్మ. పక్కన జోకర్‌లా కనిపిస్తున్నది నేనే అని కామెంట్ పెట్టాడు. వ‌ర్మ గ‌తంలో త‌న ఫ్యామిలీకి సంబంధించి కూతురిని ఎత్తుకొని దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల స‌ర్కార్ చిత్రంతో ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్న వ‌ర్మ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

1342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS